Saturday, 14 February 2015

GLOB : LATITUDES AND LONGITUDES 
గ్లోబు : అక్షాంశాలు మరియు రేఖాంశాలు 
  

  • గ్లోబ్ అనేది భూమి యొక్క నమూనా 
  • గ్లోబ్ పై దేశములు , ఖండములు సముద్రములు యొక్క సరియైన స్వరూపములు చూపబడతాయి 
  • భూమి పై మనము ప్రదేశాలను గుర్తించడం కష్టం కనుక శాస్త్రవేత్తలు కొన్ని ఉహారేఖలు గ్లోబు పై చిత్రించారు ,వాటిని అక్షాంశాలు మరియు రేఖాంశాలు అంటారు. ఇవి ఉహరేఖలు మాత్రమే
  • అక్షాంశాలు మరియు రేఖాంశాలు  సహాయంతో మనం భూమి పై ప్రదేశాలను గుర్తించవచ్చు. 
  • భూమి ఒక  ప్రకక్కు ఒరిగి తిరుగుతూ ఉంటుంది 
  • భూమి పడమటి దిశ నుండి తూర్పు దిశకు తిరుగుతూ ఉంటుంది. 
  • అక్షాంశాలు :
  • భూమిని రెండు సమాన భాగాలు చేస్తూ అడ్డంగా ఒక గీత గియ్యబడి ఉంటుంది దీనిని భూమధ్యరేఖ అంటారు . 
  •  భూమధ్యరేఖకు ఉత్తరం వైపు గల సగ భాగమును ఉత్తరార్ధ గోళం అంటారు , దక్షిణం వైపు గల సగ భాగమును దక్షిణార్ధ గోళం అంటారు . 
  • భూమధ్యరేఖ అనేది ఒక ఉహా వృత్తము, ఇది  భూమి పై  ప్రదేశాలను గుర్తించడానికి చాలా ముఖ్యమైనది. 
  • భూమధ్యరేఖకు సమాంతరంగా ద్రువాల వైపు గీయబడిన వృత్తాలను సమాంతర అక్షాంశాలు అంటారు .
  • అక్షాంశాలను డిగ్రీలలో ( ° ) కొలుస్తారు. 
  • భూమధ్యరేఖను  అక్షాంశము అంటారు
  • భూమధ్యరేఖనుమడి ధ్రువాల వైపు ఉన్న దూరం ,ఉత్తరం వైపు గాని, దక్షిణం వైపు గాని , 90° ఉంటుంది . ఇది భూమి చుట్టూ గీయబడిన 360° వృత్తంలో 1/4 వ వంతు ఉంటుంది . 1/4 of 360° గా కొలుస్తారు 
  •  90°ఉత్తర అక్షాంశమును ఉత్తర ధ్రువం అని అంటారు .   
  • 90° ల దక్షిణ అక్షాంశమును దక్షిణ ధ్రువం అని అంటారు . 
  • ఉత్తరం వైపు ఉన్న అన్ని అక్షాంశములను ఉత్తర అక్షాంశములని,  దక్షిణం వైపు ఉన్న అన్ని అక్షాంశములను దక్షిణ అక్షాంశములని అంటారు.
  •   ఉత్తర ధ్రువాన్ని ' N  ' తో దక్షిణ ధ్రువాన్ని  ' S ' తో సూచిస్తారు . 
  • భూమధ్యరేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లేకొద్ది అక్షంశముల యొక్క పరిమాణము తగ్గుతూ వస్తుంది. 
  • ర్కట రేఖ 23 అండ్ 1/2° N ఉత్తర అక్షాంశము
  • మకర రేఖ 23 అండ్ 1/2° S దక్షిణ అక్షాంశము      
  • ఉత్తర ఆయనరేఖ  66 అండ్ 1/2° N భూమధ్యరేఖకు ఉత్తరం వైపు ఉంటుంది.  
  • దక్షిణ ఆయనరేఖ  66 అండ్ 1/2° S భూమధ్యరేఖకు దక్షిణం వైపు ఉంటుంది.  
  • సూర్యుడు సంవత్సరం లో  ఒక్కసారైనా కర్కట , మకర రేఖల మధ్య ఉన్న ప్రేదేశాలలోమధ్యాహ్న సమయంలో నడినెత్తిన వస్తాడు. ఆ సమయంలో  ఆ ప్రదేశం అధిక ఉష్ణోగ్రతను గ్రహిస్తుంది.          దానిని ఉష్ణోమండల ప్రాంతం అంటారు . 
  • సూర్య కిరణాలు  ఏటవాలుగా పడే ప్రదేశం అనగా కర్కటరేఖ ఆర్కిటిక్  వలయము ,  మకర రేఖ అంటార్కిటిక్  వలయము . మధ్య గల ప్రేదేశాలలో ఉష్ణోగ్రతలు సమశీతలంగా ఉంటాయి. వీటిని సమశీతోష్ణ మండలాలు అంటారు .  
  • అంటార్కిటిక్  వలయము మరియు ఉత్తరధ్రువం మధ్య, అంటార్కిటిక్  వలయము మరియు దక్షిణధ్రువం మధ్య గల ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది  దీనిని అతి శీతలమండలం అంటారు , ఈ ప్రాంతాలలో సూర్య కిరణాలు తక్కువగా ప్రశరిస్తాయి.