Thursday, 12 February 2015

CLASSIFICATION OF PLANET
గ్రహాల యొక్క  వర్గీకరణ 

గ్రహాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు అంతర గ్రహాలు , భాహ్య గ్రహాలు  
అంతర గ్రహాలు (inner planets) :

సూర్యునికి దగ్గరగా ఉండి , రాతితో ఏర్పడి ఉంటాయి.  
ఇవి సహజంగా ఏర్పడిన ఉపగ్రహాలను కలిగి ఉండకపోవచ్చు  లేదా ఉండొచ్చు .
ఇవి కేంద్ర భాగాలో (core) కరిగి ఉన్న లోహాలు (molten metals) కలిగి ఉంటాయి.
 ఇవి వేగంగా తిరుగుతాయి ,  పరిభ్రమణ (revolution) సమయం చాల తక్కువగా ఉంటుంది. 
MERCURY - భుదుడు,VENUS -  శుక్రు డు,EARTH - భూమి, MARS - కుజుడు  (అంగారకుడు ). 
                  

బాహ్య గ్రహాలు (outer planets) : 

సూర్యునికి దూరంగా ఉండి, వాయువులతో , ద్రవాలతో ఏర్పడి ఉంటాయి. 
 ఇవి ఎక్కువ సంఖ్యలో సహజ ఉపగ్రహాలను కలిగి ఉంటాయి . 
వీటి చుట్టూ గ్రహ శకలాల  వలయాలు ఉంటాయి 
ఇవి నెమ్మదిగా తిగుగుతాయి ,  పరిభ్రమణ (revolution) సమయం చాల ఎక్కువగా ఉంటుంది. 
JUPITER - గురుడు  / బృహస్పతి, SATURN - శని,URANUS - ఇంద్రుడు,NEPTUNE - వరుణుడు .
                        
                      
  •   మనకి దగ్గరగా ఉన్న గాలక్సీ ఆన్డ్రోమెడ  

PLUTO - ప్లూటో  


  • ప్లూటోని  అంతర్జాతీయ ఖగోళ సంగము (IAU) INTERNATIONAL ASTRONOMICAL UNION ఆగష్టు/24 /2006 లో జరిగిన సమావేశం లో గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది, కనుక ప్రస్తుతం ఎనిమిది గ్రహాలు మాత్రమే కలవు
  • ప్లూటోని పోలి ఉన్న ఇతర ఖగోళ రూపాలను కనుగొనడం వలన దీనిని తొలగించారు . 
  • ఉపగ్రహంకు ఉండవలసిన నియమాలు , 1. ఒక నిర్దిష్టమైన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి, 2. సరియైన ద్రవ్యరాశి కలిగి గోళాకారంలో ఉండాలి. 
  • ఉపగ్రహం కానీ ఖగోళ రూపాలు ఈ రెండు నియమాలు కలిగి ఉంటే దానిని మరగుజ్జు గ్రాహం (dwarf planet) అంటారు , మొదటి నియమం మాత్రమే కలిగి ఉంటే చిన్న సౌరకుటుంబ రూపము (small solar system body) అంటారు. 
  • ప్రస్తుతం 5 మరగుజ్జు గ్రహాలు సౌరకుటుంబలో ఉన్నాయి అవి, 1. ప్లూటో 2. సెరిస్ , 3. ఎరిస్, 4. మకేమక్, 5. హుమియ.