Tuesday, 10 February 2015

SOLAR SYSTEM - సౌర కుటుంబము ముఖ్యమైన అంశాలు

SOLAR SYSTEM - సౌర కుటుంబము ముఖ్యమైన అంశాలు 


  •  పగటి సమయంలో ఆకాశంలోని  చంద్రుడు, నక్షత్రాలు వంటి ఇతర  ఖగోళ  స్వరూపాలు మన కంటికి కనిపించక పోవడానికి గల  కారణం సూర్యుని యొక్క కాంతి అధికంగా ఉండటం.   
  • ఖగోళ స్వరూపాలు  చాలా పెద్దవిగా ఉండి అత్యంత ఉష్ణోగ్రతను కలిగి  ఉంటాయి వాటిని " నక్షత్రాలు"  అంటారు " అవి వాయువులతో ఏర్పడి ఉంటాయి ",  క్షత్రాలు స్వయంప్రకాశకాలు, మన సూర్యుడు కూడా ఒక పెద్ద నక్షత్రం  . 
  • సూర్యుని కన్నా పెద్ద నక్షత్రాలు విశ్వంలో చాలాకలవు మనకు  దూరంగా ఉండుటవలన అవి చిన్నవిగా కనిపిస్తున్నాయి .
  • ఆకాశంలో  అనేక  సమూహాలు కనిపిస్తాయి వాటిని నక్షత్ర మండలాలు  అంటారు . 
  • బిగ్ బేర్ అనే నక్షత్ర మందలంను మనం సులభంగా గుర్తించవచ్చును , అందులో ఉండే మరో నక్షత్ర మండలమే స్మాల్ బేర్ / సప్తర్షి మండలం  . 
  • మా పూర్వికులు స్మాల్ బేర్ / సప్తర్షి మండలం  సహాయంతో  ధ్రువనక్షత్రంను గుర్తించి  రాత్రి సమయాలలో దిక్కులను గుర్తించేవారు. 
  • ధ్రువనక్షత్రం ఎల్లప్పుడు ఉత్తర దిక్కున ఉంటుంది.  
  • కొన్ని ఖగోళ స్వరూపాలు స్వయం ప్రకాశకాలు కావు అవి నక్షత్రాల వలన  కాంతిని గ్రహించి ప్రకాశిస్తాయి వాటిని గ్రహాలు అంటారు . 
  •  planet (గ్రాహం) అనే పదం planeta అనే  గ్రీకు పదం  నుండి వచ్చింది, దాని అర్ధం అద్భుతాలు . 
  • మనం నివశించే  భూమి ఒక గ్రాహం, అది కాంతిని, వేడిమిని సూర్యుని  నుండి గ్రహిస్తుంది . 
  • సూరుడు మనకు దగ్గరగా ఉన్న ఒక నక్షత్రం
  • చంద్రుడు భూమి యొక్క ఉపగ్రహం
  • సూర్యుడు 8 గ్రహాలు వాటి ఉపగ్రహాలు అన్నింటిని కలిపి సౌరకుటుంబం అంటాము 
  • సూర్యుడు స్వయం ప్రకాశి ,భూమికి 150 మిలియన్ల కిలోమీటర్ల   దూరంలో ఉంటాడు . 
  • గ్రహాలు అన్ని సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైన కక్షలో తిరుగుతాయి . 
  • సూర్యునికి అతి దగ్గరలో ఉండే గ్రాహం బుధుడు ఇది సూర్యుని చుట్టూ  ఒకసారి తిరిగి రావడానికి 88 రోజులు పడుతుంది . 
  • శుక్రగ్రహంను భూమికి కవల సోదరుడు అంటారు. 
  • సూర్యునికి అతి దగ్గరగా ఉండే 3వ గ్రాహం భూమి , ఇది పరిమాణంలో 5వది
  • sol అంటే రోమన్ శాస్త్రాల ప్రకారం sun god అని అర్ధం అంటే సూర్యునికి సంబందించినది. 
  • Geography అనే పదం గ్రీకు భాష నుండి గ్రహించబడింది , GE అంటే భూమి , GRAPHIA అంటే వ్రాయడం . 
  • GEOLOGY: భూమి గురించి అధ్యయనం 
  • GEOMETRY: భూమి యొక్క కొలతలకు సంబందించినది. 
  • GEOID: భూమి రూపము, స్వరూపమునకు సంబందించినది.
  • అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి నీలి రంగులో కనిపిస్తుంది , దీనికి కారణం , భూమి యొక్క ఉపరితలం 2/3 వంతు నీటితో నిండి ఉంటుంది, అందువలన భూమిని నీలిగ్రహం అంటారు.
  • చంద్రుడు భూమిలో 1/4 వ భాగం ఉంటాడు, భూమికి చంద్రుడికి మధ్యగల దూరం 3,84,400 కిలోమీటర్లుచంద్రుడు తనచుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు పడుతుంది . 
  • కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది . 
  • సూర్యుని నుండి భూమికి కంతి 8 నిమిషాలలో చేరుతంది . 
  • ఆకాశంలో రాత్రి సమయంలో ఒక నదిలా మెరుస్తూ కనిపించే బెల్టు వంటి భాగాన్ని ఆకాశగంగ / పాలపుంత అంటారు.
  • మన సౌరకుటుంబం పాలపుంతలో ఒక భాగం , ఇటువంటి పాలపుంతలు కొన్ని లక్షలు విశ్వలో కలవు .     

No comments:

Post a Comment