తెలుగు మరియు ఆంగ్లం లో ప్రభుత్వ ,ఇతర పోటీ పరిక్షల అభ్యర్దుల కోసం : FOR COMPETITIVE EXAMINATIONS ASPIRANTS
*content published in this blog is collected from different sources
▼
Tuesday, 10 February 2015
SOLAR SYSTEM - సౌర కుటుంబము ముఖ్యమైన అంశాలు
SOLAR SYSTEM - సౌర కుటుంబము ముఖ్యమైన అంశాలు
పగటి సమయంలో ఆకాశంలోని చంద్రుడు, నక్షత్రాలు వంటి ఇతర ఖగోళ స్వరూపాలు మన కంటికి కనిపించక పోవడానికి గల కారణం సూర్యుని యొక్క కాంతి అధికంగా ఉండటం.
ఖగోళ స్వరూపాలు చాలా పెద్దవిగా ఉండి అత్యంత ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి వాటిని " నక్షత్రాలు" అంటారు " అవి వాయువులతో ఏర్పడి ఉంటాయి ", నక్షత్రాలు స్వయంప్రకాశకాలు, మన సూర్యుడు కూడా ఒక పెద్ద నక్షత్రం .
సూర్యుని కన్నా పెద్ద నక్షత్రాలు విశ్వంలో చాలాకలవు మనకు దూరంగా ఉండుటవలన అవి చిన్నవిగా కనిపిస్తున్నాయి .
ఆకాశంలో అనేక సమూహాలు కనిపిస్తాయి వాటిని నక్షత్ర మండలాలు అంటారు .
బిగ్ బేర్ అనే నక్షత్ర మందలంను మనం సులభంగా గుర్తించవచ్చును , అందులో ఉండే మరో నక్షత్ర మండలమే స్మాల్ బేర్ / సప్తర్షి మండలం .
మా పూర్వికులు స్మాల్ బేర్ / సప్తర్షి మండలం సహాయంతో ధ్రువనక్షత్రంను గుర్తించి రాత్రి సమయాలలో దిక్కులను గుర్తించేవారు.
ధ్రువనక్షత్రం ఎల్లప్పుడు ఉత్తర దిక్కున ఉంటుంది.
కొన్ని ఖగోళ స్వరూపాలు స్వయం ప్రకాశకాలు కావు అవి నక్షత్రాల వలన కాంతిని గ్రహించి ప్రకాశిస్తాయి వాటిని గ్రహాలు అంటారు .
planet (గ్రాహం) అనే పదం planeta అనే గ్రీకు పదం నుండి వచ్చింది, దాని అర్ధం అద్భుతాలు .
మనం నివశించే భూమి ఒక గ్రాహం, అది కాంతిని, వేడిమిని సూర్యుని నుండి గ్రహిస్తుంది .
సూరుడు మనకు దగ్గరగా ఉన్న ఒక నక్షత్రం .
చంద్రుడు భూమి యొక్క ఉపగ్రహం .
సూర్యుడు 8 గ్రహాలు వాటి ఉపగ్రహాలు అన్నింటిని కలిపి సౌరకుటుంబం అంటాము
సూర్యుడు స్వయం ప్రకాశి ,భూమికి 150 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు .
గ్రహాలు అన్ని సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైన కక్షలో తిరుగుతాయి .
సూర్యునికి అతి దగ్గరలో ఉండే గ్రాహంబుధుడు ఇది సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 88 రోజులుపడుతుంది .
శుక్రగ్రహంను భూమికి కవల సోదరుడు అంటారు.
సూర్యునికి అతి దగ్గరగా ఉండే 3వ గ్రాహం భూమి , ఇది పరిమాణంలో 5వది .
sol అంటే రోమన్ శాస్త్రాల ప్రకారం sun god అని అర్ధం అంటే సూర్యునికి సంబందించినది.
Geography అనే పదం గ్రీకు భాష నుండి గ్రహించబడింది , GE అంటే భూమి , GRAPHIA అంటే వ్రాయడం .
GEOLOGY: భూమి గురించి అధ్యయనం
GEOMETRY: భూమి యొక్క కొలతలకు సంబందించినది.
GEOID: భూమి రూపము, స్వరూపమునకు సంబందించినది.
అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి నీలి రంగులో కనిపిస్తుంది , దీనికి కారణం , భూమి యొక్క ఉపరితలం 2/3 వంతు నీటితో నిండి ఉంటుంది, అందువలన భూమిని నీలిగ్రహం అంటారు.
చంద్రుడు భూమిలో 1/4 వ భాగం ఉంటాడు, భూమికి చంద్రుడికి మధ్యగల దూరం 3,84,400 కిలోమీటర్లు. చంద్రుడు తనచుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులుపడుతుంది .
కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది .
సూర్యుని నుండి భూమికి కంతి 8 నిమిషాలలోచేరుతంది .
ఆకాశంలో రాత్రి సమయంలో ఒక నదిలా మెరుస్తూ కనిపించే బెల్టు వంటి భాగాన్ని ఆకాశగంగ / పాలపుంతఅంటారు.
మన సౌరకుటుంబం పాలపుంతలో ఒక భాగం , ఇటువంటి పాలపుంతలు కొన్ని లక్షలు విశ్వలో కలవు .
No comments:
Post a Comment