Monday, 16 February 2015

LONGITUDES - రేఖాంశాలు:
  • ఉత్తర ద్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు గీయబడిన ఉహా రేఖలను రేఖాంశాలు అంటారు. 
  • ఇవన్ని అర్ధ వృత్తాలు
  • రేఖాంశాల మధ్య దూరాన్ని డిగ్రీలలో ( ° ) కొలుస్తారు . డిగ్రీలను తరువాత నిమిషాలలో ఆతరువాత సేకెనులలో భాగిస్తారు. 
  • రేఖాంశాల మధ్య దూరం ధ్రువాల వైపు వెళ్ళే కొలదీ తగ్గుతుంది . 
  • ఇవి ధ్రువాల వద్ద కలిసినప్పుడు వీటి కొలమానము సున్నాగా మారుతుంది .
  • రేఖాంశాల మధ్యలో ఇరు ధ్రువాలను కలుపుతూ ఒక రేఖ ఉంటుంది , దీనిని ప్రాధాన రేఖాంశం (PRIME MERIDIAN) అంటారు . దీనిని 0° ల రేఖాంశం అంటారు . 
  • ఇది బ్రిటన్ లోని గ్రీనిచ్ (GREENWICH) మీదుగా పోతుంది , దీనిని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. రేఖాంశాలను 0° ల రేఖాంశం నుండి లెక్క బేడతారు అంటారు .
  • 0° ల నుండి 180° లు తూర్పు వైపుకు, 180°లు పశ్చిమ వైపుకులెక్క బేడతారు.  
  • వీటిని 180° E, 180° W  గా రాస్తారు . 
  • 180° లు తూర్పు,180°లు పశ్చిమ రేఖాంశాలు ఒకే రేఖ పై వస్తాయి . దానిని ప్రాధాన రేఖాంశం (PRIME MERIDIAN) అంటారు.