Wednesday, 18 February 2015

STANDARD TIME

 STANDARD TIME 
స్థిరమైన సమయము


  • భూమి పై అన్ని ప్రదేశాలలో సమయము ఒకేలా ఉండదు . 
  • ప్రతీ దేశము తమ సౌలభ్యం కోసం  ఒక్కొక్క స్థిర రేఖాంశంను నిర్ణయించు కుంటుంది.   
  • ఏ ప్రదేశంలోనైనా అక్కడి స్థిర రేఖాంశంను(STANDARD MERIDIAN)  ఆధారంగా చేసుకొని సమయాన్ని నిర్ణయిస్తారు 
  • భారత దేశం యొక్క స్థిర రేఖాంశం 82 అండ్ 1/2° E (82° 30 E) IST  (INDIAN STANDARD TIME).


  • కొన్ని దేశాలు అధిక స్థిర రేఖాంశాలను కలిగి ఉంటాయి . 
  • ఉదాహరణకు: 
  • రష్యా కు ( RUSSIA) 24  సమయ విభాగాలు కలవు ఒక్కొక విభాగము15° స్థిర రేఖాంశంలను కలిగి ఉంటుంది




LONGITUDES AND TIME - రేఖాంశాలు మరియు సమయము

LONGITUDES AND TIME
 రేఖాంశాలు మరియు సమయము 

రేఖంశాలను ఆధారంగా చేసుకొని మనం సమయంను లేక్కిస్తాము 
ఏ ప్రదేశంలోనైనా సమయమును లేక్కించడానికి సరియైన సమయాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, మద్యాహ్నం. 
ఈ సమయాలలో సూర్య కిరణాల యొక్క నీడను ఆధారంగా చేసుకొని సమయాన్ని లెక్కిస్తారు. 
గ్రీనిచ్(Greenwich) రేఖంశం పై సూర్య కిరణాలు నిటారుగా పడినప్పుడు ఆ రేఖపై ఉన్న అన్ని ప్రదేశాలలో మధ్యాహ్నం అవుతంది.
భూమి పశ్చిమం నుండి తూర్పుకు తిరుగుతున్నా సమయంలో గ్రీనిచ్ నుండి తూర్పు వైపు ఉన్న ప్రాంతాల సమయం గ్రీనిచ్ సమయం కన్నా ముందు (ఎక్కువగా) ఉంటుంది. పశ్చిమం వైపు ఉన్న ప్రాంతాలలో తక్కువగా ఉంటుంది .  


ఆ సమయ భేదాన్ని లెక్కించే విధానము:                                          భూమి రేఖాంశాల పై  తిరిగేటప్పుడు మొత్తం 360° లు తిరుగుతుంది ,

360°W 24 గంటలలో అంటే, ఒక గంటకు 15° అంటే నాలుగు నిమిషాలలో 

1° తిరుగుతుంది. అంటే గ్రీనిచ్ పై 12 గంటలు అయితే 15°E తూర్పు 

రేఖాంశం పై సమయము 15 *4 = 60 నిమిషాలు, అంటే ఒక గంట 

(1 hour) అంటే గ్రీనిచ్ నుండి పశ్చిమ రేఖాంశం లో ఒక గంట అంటే

 11గంటలు అవుతుంది. అంటే 180° రేఖాంశం మీద అర్ధరాత్రి 12

 గంటలు అవుటుంది.