GLOB : LATITUDES AND LONGITUDES
గ్లోబు : అక్షాంశాలు మరియు రేఖాంశాలు
- గ్లోబ్ అనేది భూమి యొక్క నమూనా
- గ్లోబ్ పై దేశములు , ఖండములు సముద్రములు యొక్క సరియైన స్వరూపములు చూపబడతాయి
- భూమి పై మనము ప్రదేశాలను గుర్తించడం కష్టం కనుక శాస్త్రవేత్తలు కొన్ని ఉహారేఖలు గ్లోబు పై చిత్రించారు ,వాటిని అక్షాంశాలు మరియు రేఖాంశాలు అంటారు. ఇవి ఉహరేఖలు మాత్రమే .
- అక్షాంశాలు మరియు రేఖాంశాలు సహాయంతో మనం భూమి పై ప్రదేశాలను గుర్తించవచ్చు.
- భూమి ఒక ప్రకక్కు ఒరిగి తిరుగుతూ ఉంటుంది
- భూమి పడమటి దిశ నుండి తూర్పు దిశకు తిరుగుతూ ఉంటుంది.

- అక్షాంశాలు :
- భూమిని రెండు సమాన భాగాలు చేస్తూ అడ్డంగా ఒక గీత గియ్యబడి ఉంటుంది దీనిని భూమధ్యరేఖ అంటారు .
- భూమధ్యరేఖకు ఉత్తరం వైపు గల సగ భాగమును ఉత్తరార్ధ గోళం అంటారు , దక్షిణం వైపు గల సగ భాగమును దక్షిణార్ధ గోళం అంటారు .
- భూమధ్యరేఖ అనేది ఒక ఉహా వృత్తము, ఇది భూమి పై ప్రదేశాలను గుర్తించడానికి చాలా ముఖ్యమైనది.
- భూమధ్యరేఖకు సమాంతరంగా ద్రువాల వైపు గీయబడిన వృత్తాలను సమాంతర అక్షాంశాలు అంటారు .
- అక్షాంశాలను డిగ్రీలలో ( ° ) కొలుస్తారు.
- భూమధ్యరేఖను 0° అక్షాంశము అంటారు
- భూమధ్యరేఖనుమడి ధ్రువాల వైపు ఉన్న దూరం ,ఉత్తరం వైపు గాని, దక్షిణం వైపు గాని , 90° ఉంటుంది . ఇది భూమి చుట్టూ గీయబడిన 360° వృత్తంలో 1/4 వ వంతు ఉంటుంది . 1/4 of 360° గా కొలుస్తారు
- 90° ల ఉత్తర అక్షాంశమును ఉత్తర ధ్రువం అని అంటారు .
- 90° ల దక్షిణ అక్షాంశమును దక్షిణ ధ్రువం అని అంటారు .
- ఉత్తరం వైపు ఉన్న అన్ని అక్షాంశములను ఉత్తర అక్షాంశములని, దక్షిణం వైపు ఉన్న అన్ని అక్షాంశములను దక్షిణ అక్షాంశములని అంటారు.
- ఉత్తర ధ్రువాన్ని ' N ' తో దక్షిణ ధ్రువాన్ని ' S ' తో సూచిస్తారు .
- భూమధ్యరేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లేకొద్ది అక్షంశముల యొక్క పరిమాణము తగ్గుతూ వస్తుంది.
- కర్కట రేఖ 23 అండ్ 1/2° N ఉత్తర అక్షాంశము
- మకర రేఖ 23 అండ్ 1/2° S దక్షిణ అక్షాంశము
- ఉత్తర ఆయనరేఖ 66 అండ్ 1/2° N భూమధ్యరేఖకు ఉత్తరం వైపు ఉంటుంది.
- దక్షిణ ఆయనరేఖ 66 అండ్ 1/2° S భూమధ్యరేఖకు దక్షిణం వైపు ఉంటుంది.
- సూర్యుడు సంవత్సరం లో ఒక్కసారైనా కర్కట , మకర రేఖల మధ్య ఉన్న ప్రేదేశాలలోమధ్యాహ్న సమయంలో నడినెత్తిన వస్తాడు. ఆ సమయంలో ఆ ప్రదేశం అధిక ఉష్ణోగ్రతను గ్రహిస్తుంది. దానిని ఉష్ణోమండల ప్రాంతం అంటారు .
- సూర్య కిరణాలు ఏటవాలుగా పడే ప్రదేశం అనగా కర్కటరేఖ ఆర్కిటిక్ వలయము , మకర రేఖ అంటార్కిటిక్ వలయము . మధ్య గల ప్రేదేశాలలో ఉష్ణోగ్రతలు సమశీతలంగా ఉంటాయి. వీటిని సమశీతోష్ణ మండలాలు అంటారు .
- అంటార్కిటిక్ వలయము మరియు ఉత్తరధ్రువం మధ్య, అంటార్కిటిక్ వలయము మరియు దక్షిణధ్రువం మధ్య గల ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది దీనిని అతి శీతలమండలం అంటారు , ఈ ప్రాంతాలలో సూర్య కిరణాలు తక్కువగా ప్రశరిస్తాయి.
